ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగబోతుంది. ఈ మ్యాచ్ లో ముంబయి బౌలర్ బుమ్రా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ముంబయి ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో ప్రారంభించింది. ఆడిన నాలుగు మ్యాచ్ లలో కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. మరి ఆ జట్టు స్టార్ పేసర్ బుమ్రా గాయం నుంచి కోలుకోని తిరిగి జట్టు జట్టులోకి వస్తున్నాడు.
ఆర్సీబీ జట్టు ఈ సీజన్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో కేవలం ఒక్క మ్యాచ్ లోనే ఓడిపోయింది. ఆర్సీబీకి ఈసారి బౌలింగ్ ప్రధాన బలం అనే చెప్పవచ్చు. బుమ్రా ఎంట్రీ ఇచ్చిన ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి మరీ.
ఆర్సీబీ జట్టు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్
ముంబయి ఇండియన్స్ జట్టు : విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్