వరుస సెలవులు రావడంతో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు కుటుంబంతో సహా సందర్శిస్తున్నారు. ముఖ్యంగా యాదాద్రి, భద్రాద్రి ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ఇవాళ సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది.
మరోవైపు భద్రాద్రి రామయ్య సన్నిధిలోనబ భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం కోసం తరలివస్తున్నారు. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం సందర్భంగా ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల మూలమూర్తులకు అర్చకులు విశేష అభిషేకం నిర్వహించారు. భక్తుల రద్దీ పెరగడంతో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రధాన ఆలయంలో భక్తులకు బంగారు పుష్పాల అర్చనను ఆపివేశారు.