రేషన్ కార్డుదారులందరికీ తెలంగాణ వ్యాప్తంగా జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాలు శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల వాగ్దానంలో ఈ పథకం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అంశాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. నాణ్యమైన బియ్యాన్ని వినియోగదారులకు అందించడం ప్రాధాన్యతను వివరించారు. అవసరమైన చోట సబ్సిడీ ధరలకు గోధుమలను సరఫరా చేయాలని కూడా అధికారులను ఆదేశించారు.
అలాగే పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్ డీలర్లకు హెచ్చరించారు రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వారికి ప్రోత్సాహకాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు. అయితే పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదని, డీలర్‌షిప్‌ను రద్దు చేయడమే కాకుండా జరిమానా కూడా విదిస్తామని అని ఆయన హెచ్చరించారు. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.