మగాళ్లు అయితే.. కేశవరావు లాగా రాజీనామా చేసి వెళ్లండి అంటూ బీఆర్‌ఎస్ పార్టీని వీడే నేతలకు హెచ్చరికలు జారీ చేశారు సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్. ఇవాళ సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ…ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు బీఆర్‌ఎస్ తరపున గెలిచిన వ్యక్తని… జిల్లాలో ఓటు హక్కు లేకున్నా ఉద్యమకారులను కాదని కెసిఆర్ ఆయనకు టికెట్ ఇచ్చారన్నారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవి కాలం ముగిసిన తర్వాత పార్టీ మారవు….తనకు ఓటు వేసిన జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆపదలో ఉంటే ఎవరికి అక్కరకు రాని వ్యక్తి భానుప్రసాద్ రావు అంటూ ఆగ్రహించారు. భాను ప్రసాద్ రావుకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలువాలని సవాల్ విసిరారు. ఎవరికి సమాచారం ఇవ్వకుండా దొంగలాగ అర్దరాత్రి పార్టీ మారి నీకు ఓటు వేసిన జెడ్పి టిసిలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను మోసం చేశావు అంటూ ఫైర్ అయ్యారు. మన కష్టాల్లో తోడు ఉండని భాను ప్రసాద్ రావు లాంటి వారికి భవిష్యత్తులో ఓట్లు వేయొద్దని కోరారు. కేకేకు ఉన్న పౌరుషం నీకు లేదా…మొగొని వైతే కెకె మాదిరిగా భాను ప్రసాద్ రావు రాజీనామా చేయాలన్నారు.