కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల హామీల మేరకు 6 గ్యారెంటీలను అమలును చకా చకా అడుగులు వేస్తోంది. ప్రభుత్వంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండ హామీలను అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు అనగా డిసెంబర్ 28 నుంచి మరో రెండు పథకాలను అమలు చేయడానికి సిద్ధం అయింది. ఈ విషయాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం జిల్లాల పర్యటనలో చెప్పారు.
మరోవైపు గాంధీభవన్ లో నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కూడా ఆరు గ్యారెంటీలపై చర్చ జరిగింది. పార్టీ వ్యవస్థాపక దినమైన డిసెంబర్ 28 నుంచి ఫించన్ పెంపు, రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలు ప్రక్రియను ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. చేయూత ఫించన్ 4వేలకు పెంపు.. 500 కే సబ్సీడీ గ్యాస్ సిలిండర్ పంపిణీకి శ్రీకారం చుట్టారు.