భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి డీకే అరుణకు ఊహించని షాక్ తగిలింది. బీజేపీ పార్టీ నేత DK అరుణ కూతురుపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు అయింది. తాజాగా… కోర్ట్ ఆదేశంతో DK అరుణ కూతరు శృతి రెడ్దీ, వినోదలపై కేసు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు. ఎలీషాబాబు ఫిర్యాదు మేరకు IPC 323, 336, 341, 384, 448, 506 R/W 34…..SC ST POA Act కి 3(C) ,3(r) , 3(s) సెక్షన్ల కింద FIR నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు.
బంజారా హిల్స్ లోని PVP ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు చేస్తున్న తమపై శృతి రెడ్ది దూషించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు ఎలీషా బాబు. ఈ నేపథ్యంలోనే.. పోలీసులకు పక్కా ఆధారాలు సమర్పించారు ఎలీషా బాబు. ఇక ఆ ఆధారాలను పరిశీలించిన బంజారా హిల్స్ పోలీసులు.. DK అరుణ కూతురిపై SC,ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇంకా దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.