సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల షెడ్యూలు ఖరారు అయింది. ఈ నెల 15 నుంచి నవంబర్ 8 వరకు సీఎం కెసిఆర్ పర్యటనలు కొనసాగనున్నాయి. ప్రతి రోజూ రోజు రెండు నుంచి 3 సభల్లో పాల్గననున్నారు సీఎం కేసీఆర్. దాదాపు 40 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ సభలు ఉంటాయి. ఇక సీఎం కేసీఆర్ కు హుస్నాబాద్ సెంటీమెంట్ గా మారిపోయింది.
2014, 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్నిప్రారంభించారు. ఇందులో భాగంగానే.. అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. అక్టోబర్ 15వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహిసతారు. అదేరోజు అభ్యర్థులకు బీ ఫారాలను అందించి పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఇక అటు నవంబర్ 9న రెండు చోట్ల నామినేషన్ వేయనున్నారు సీఎం కేసీఆర్.