నేటి నుంచి తెలంగాణలో వన మహోత్సవం ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం 10 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

ఇది ఇలా ఉండగా, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం వాయిదా పడింది. నేడు గాంధీభవన్‌లో జరగాల్సిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం వాయిదా వేసినట్టు ప్రకటించారు ఎంపీ మల్లు రవి. కాగా, 10వ తేదీ ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనున్నట్టు వెల్లడించారు. వరంగల్‌లో కార్పొరేషన్ సమావేశం ఉన్నందున.. క్రమశిక్షణ కమిటీ సమావేశం వాయిదా వేసినట్టు తెలిపారు మల్లు రవి.