తెలంగాణ, ఏపీలలో ఇవాళ పాఠశాలలు, కాలేజీలు బంద్ కానున్నాయి. గత మూడు రోజుల నుంచి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ ప్రభుత్వం నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే జేఎన్టీయూ, ఉస్మానియా, కేయు యూనివర్సిటీల పరిధిలోని అన్ని కాలేజీలకు అధికారులు నేడు సెలవు ప్రకటించారు. ఇక నేడు జరగాల్సిన పరీక్షలను సైతం వాయిదా వేశారు. అటు ఏపీలోనూ విద్యాసంస్థలకు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.