హైదరాబాద్‌లో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు పోలీస్ కమిషనర్ CV ఆనంద్. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు పోలీస్ కమిషనర్ CV ఆనంద్. హైదరాబాద్ సిటి లో నెలరోజుల పాటు పోలీస్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు పోలీస్ కమిషనర్ CV ఆనంద్. అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వాస నీయ సమాచారం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు పోలీస్ కమిషనర్ CV ఆనంద్.
U/S 163 BNS యాక్ట్ ప్రకారం ఆంక్షలు హైదరాబాద్ లో అమలు చేస్తామన్నారు పోలీస్ కమిషనర్ CV ఆనంద్. సభలు, సమావేశాలు, దర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీ లు నిషేధం అని తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీస్ కమిషనర్ CV ఆనంద్. నవంబర్ 28వరకు వరకు నెల రోజుల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు సిటి పోలీస్ కమీషనర్ సివి ఆనంద్.