మరికాసేపట్లో కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

-

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 17 ఎంపీ స్థానాలకు సంబంధించిన కౌంటింగు ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. 120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్లు లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం ఓట్ల లెక్కింపు ఒకేసారి మొదలుపెట్టనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కౌంటింగ్‌ పూర్తి కావొచ్చని అధికారుల అంచనా.  మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు.

మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితం కూడా ఇవాళే తేలనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉపఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ తరఫున లాస్య నందిత సోదరి నివేదిత, కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేష్, బీజేపీ అభ్యర్థిగా టీఎన్ వంశతిలక్ సహా 15 మంది పోటీలో ఉన్నారు.

మరోవైపు సికింద్రాబాద్ లోక్ సభ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎం బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news