ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాలు.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం

-

లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. తెల్లవారుజామునే ఆలయానికి వచ్చిన హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సాకలు సమర్పించి విశేష నివేదన చేశారు.

మరోవైపు మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహంకాళి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి వైభవంగా నిర్వహిస్తుందని తెలిపారు. అమ్మవారి బోనాన్ని అలంకరించి అంగరంగ వైభవంగా ఉత్సవాలను ప్రారంభించినట్లు వెల్లడించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఇక్కడ బోనం సమర్పించడానికి అక్కాచెల్లెళ్లు అందరూ వస్తున్నారని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం చేసిందని మంత్రి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news