ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావుపై రెడ్‌కార్నర్‌ నోటీసు!

-

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావుతోపాటు ఆరో నిందితుడు అరువెల శ్రవణ్‌రావుపై ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయించాలని హైదరాబాద్‌ పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఐడీ ద్వారా సీబీఐకి అభ్యర్థన పంపించగా.. సీబీఐ దానిని ఇంటర్‌పోల్‌కు పంపనుంది. గతంలో వీరిద్దరిపై బ్లూకార్నర్‌ నోటీస్‌ జారీ చేయాలంటూ అభ్యర్థన పంపిన విషయం తెలిసిందే. అప్పటికి ఈ కేసులో అభియోగపత్రం దాఖలు చేయకపోవడంతో బ్లూకార్నర్‌ నోటీసుకే ప్రయత్నించారు.

ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును విచారిస్తేనే కేసు దర్యాప్తు ముందుకు సాగే అవకాశం ఉందని పోలీసులు న్యాయస్థానానికి విన్నవించారు. దీంతో ప్రాథమిక అభియోగపత్రాన్ని న్యాయస్థానంలో దాఖలు చేసి బ్లూకార్నర్‌తోపాటు రెడ్‌కార్నర్‌ నోటీసులపైనా పోలీసులు దృష్టి పెట్టారు. ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు దర్యాప్తు అధికారులకు ఇది వరకే సమాచారమిచ్చారు. క్యాన్సర్‌ చికిత్స కారణంగా రాలేకపోతున్నానంటూ, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు అభ్యర్థించినా న్యాయస్థానం అనుమతించలేదు. ఈ నేపథ్యంలో రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ అయితే దారి ఆధారంగా పారిపోయిన వారి ఆచూకీ, తాత్కాలిక(ప్రొవిజనల్‌) అరెస్టు కోరవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news