వేములవాడ రాజన్న ఆలయంలో భద్రత కట్టుదిట్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో భద్రత కట్టుదిట్టం చేసారు. వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు వేములవాడ రాజన్న ఆలయంతో పాటు తెలంగాణలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో భద్రత పెంచారు.

అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచనలు చేశారు. ఇక ఉగ్రదాడుల నేపథ్యంలో తెలంగాణలో హై అలర్ట్ నడుస్తోంది. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తం ఐంది. హైదరాబాద్ సహా ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది కేంద్రం. దింతో తెలంగాణలో హై అలర్ట్ నడుస్తోంది.