వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సత వేడుకలు ఎల్లుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో వేలాది బీఆర్ఎస్ యువత, కార్యకర్తలు పాదయాత్రకు పూనుకున్నారు.శుక్రవారం ఉదయం మాజీ మంత్రి గులాబీ జెండా ఊపి వారి పాదయాత్రను ప్రారంభించారు.
ఈ నెల 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. ఇప్పటికే సభ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, యువత విభాగం చేపట్టిన పాదయాత్రను మాజీ మంత్రి హరీశ్ రావు ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. రెండురోజుల్లోగా వీరు సభాస్థలి వద్దకు చేరుకోనున్నారు. కాగా, ఈ సభకు పది లక్షల మంది రానున్నారని సమాచారం.