“ఆర్‌ఆర్‌ఆర్‌” మూవీపై సీతక్క సంచలన వ్యాఖ్యలు

ప్రపంచ వ్యాప్తంగా ‘ ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో పిరియాడిక్ డ్రామా గా వచ్చిన ఈ సినిమా తెలుగు, హిందీ, ఇండియా, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతోంది. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంతో వస్తున్న సినిమా కావడంతో, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ కాంబినేషన్ కావడంతో సహజంగానే ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది.

దీనికి తగ్గట్లుగానే సినిమా యూనిట్ ప్రమోషన్ వర్క్ చేసింది. అయితే.. ఈ సినిమాపై కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సీతక్క స్పందించింది. నిన్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూసిన తర్వాత… మూవీపై రివ్యూ ఇచ్చింది. దేశాన్ని విభజించేందుకు కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా చూడాలని.. అదే దేశం బాగు, సమైక్యత కోసం.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూడాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆర్‌ఆర్‌ఆర్‌ లోని ఎన్టీఆర్‌ సీన్‌ను ట్యాగ్‌ చేసింది సీతక్క. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ గా మారింది.