సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్‌కు చిన్న మెదడు చితికిపోయింది అంటూ మంత్రి సీతక్క షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం లో కమీషన్ తీసుకున్నప్పుడు లేని భయం.. కమీషన్ ముందు కు రావడానికి ఎందుకు అని పేర్కొన్నారు.

గ్లోబెల్స్ ప్రచారం లో నిన్ను మించిన వారు లేరు… కేటీఆర్.. నీకు గ్లోబెల్ అవార్డు ఇవ్వాలి. అబద్దాల పునాదుల పై బిఆర్ఎస్ నడుస్తుందన్నారు మంత్రి సీతక్క.
బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతోందని విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసిఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో ప్రజలకు తెలియాలని ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కవిత, కేటీఆర్ మధ్య వైరం కోసం హరీష్ రావు ఎదురు చూస్తున్నారని.. ఇంట్లో కుంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతం అవుతున్నారని ఆగ్రహించారు.