ఈమధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం చాలా ఎక్కువ అయింది అనే చెప్పవచ్చు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ఎన్నో సామాజిక మాధ్యమాల వినియోగం ఎంతో ఎక్కువగా మారింది మరియు రోజురోజుకు ఎన్నో కొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అదేవిధంగా, తాజాగా వాట్సాప్ కూడా కొత్త గ్రూప్ ఫీచర్ ను తీసుకురావడం జరిగింది. అదే గ్రూప్ కాల్ చేయకుండానే సభ్యులు లైవ్ సంభాషణలను నిర్వహించవచ్చు. ఇలా చేయడం వలన ఎవరికి రింగ్ వెళ్లకుండానే సమాచారం చేరుతుంది.
ఈ విధంగా వినియోగదారులు రియల్ టైం ఆడియో సంభాషణలను చేసుకోవచ్చు మరియు గ్రూప్ కాల్ చేయకుండానే ఇతరులతో కనెక్ట్ అవ్వచ్చు. పైగా, ఎంపిక చేసిన సభ్యులతో మాత్రమే ఆడియో సంభాషణలను చేసుకోవచ్చు. సంభాషణలను చేయడానికి ఆడియో చాట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఎంతో త్వరగా మాట్లాడడానికి ఈ ఫీచర్ ను ఉపయోగించవచ్చు మరియు ఎలాంటి కాల్స్ అవసరం లేకుండా ఈ సంభాషణలను ఎంతో త్వరగా పూర్తి చేయవచ్చు. పైగా, గ్రూప్ లో వ్యక్తులు ఎప్పుడైనా ఈ వాయిస్ చాట్‌లో చేరి సంభాషణలను వినవచ్చు లేకపోతే వెళ్లిపోవచ్చు.
ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి వాట్సాప్ గ్రూప్‌ను ఓపెన్ చేసి కింద నుండి పైకి స్వైప్ చేయాలి. ఆ తర్వాత కాసేపు హోల్డ్ చేసి ఉంచితే వాయిస్ చాట్ ఆక్టివేట్ అవుతుంది. కాకపోతే, గ్రూప్ కాల్స్ చేసే విధంగా సభ్యులకు రింగ్ అవ్వదు. ఈ విధంగా, వాట్సాప్ వాయిస్ చాట్‌ను యాక్టివేట్ చేసి సంభాషణలను చేయవచ్చు. గ్రూప్ ఓపెన్ చేసి వాయిస్ చాట్ ను వినాలనుకునేవారు వినవచ్చు లేకపోతే వెళ్లిపోవచ్చు అని వాట్సాప్ సంస్థ చెప్పడం జరిగింది. అయితే ఈ కొత్త ఫీచర్ లను ఉపయోగించడానికి ముందుగా వాట్సాప్ అప్లికేషన్ ను అప్డేట్ చేసుకోవాలి.