సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదని సీతక్క పిటిషన్..!

-

సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదని తెలంగాణ హైకోర్టులో సీతక్క పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా విచారణ జరిగింది. 2022లో కానిస్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ రెండు కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు చేసినట్టు ప్రభుత్వం సాంక్షన్ ఆర్డర్ ఇచ్చిందని ఇప్పటివరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదని  సీతక్క చెప్పారు.  చాలాకాలంగా ఎదురుచూస్తున్నప్పటికీ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వలేదని చెప్పారు.ఈ నిధులతో ప్రజల సౌకర్యం కోసం రోడ్లు, డ్రైనేజీలు వంటివి నిర్మించడం జరుగుతుందని అన్నారు.


ఈ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తుందని ఆరోపించారు. మరో మూడు నాలుగు నెలల్లో శాసనసభకు ఎన్నికలు రాబోతున్నాయని తక్షణమే నిధులు మంజూరు చేస్తే ములుగు నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు శాసనసభ్యురాలు చొరవ చూపుతారని అన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి ఎన్నికలు జరగవచ్చునని ఈలోగా నిధులు ఇవ్వకపోతే అవన్నీ వృధా అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుండా జిల్లాకు చెందిన మంత్రి మోకాలు అడ్డు పెడుతున్నారని ఆరోపించారు.

ఎన్నిసార్లు నిధులు మంజూరు చేయాలని కోరిన అధికారుల నుంచి స్పందన లేదన్నారు.
ఇటీవల వరదలు సంభవించినప్పుడు తన నియోజకవర్గం ఎక్కువగా దెబ్బతిందని, 17 మంది చనిపోయారని, రోడ్లు డ్రైనేజీలు బాగా దెబ్బతిన్నాయని తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లో చట్ట ప్రకారం రావాల్సిన నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తే నియోజకవర్గ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమవుతుందని అన్నారు. ములుగు నియోజకవర్గ పట్ల ప్రభుత్వం వివక్ష చూపడాన్ని తీవ్రంగా ప్రకటించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news