గాడ్సే పార్టీకి మద్దతు ఇస్తావా…కోమటి రెడ్డిపై వీహెచ్‌ సీరియస్

-

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆడియో టేప్‌ వ్యవహారం పై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ స్పందించారు. ఇవాళ నారాయణపేట జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మీడియాతో మాట్లాడారు. గాంధీ ని చంపిన గాడ్సే పార్టీకి మద్దతు పలకడం సరైంది కాదని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పై ఫైర్‌ అయ్యారు.

తమ్ముని మీద ప్రేమతో సొంత ఇమేజ్ చెడగొట్టుకుంటున్నాడని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఎంపీ అయి ఉండి బీజేపీ కి ఓటు వేయమని చెప్పి చెడ్డపేరు తెచ్చుకుంటుండని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని వెల్లడించారు. నువ్వు ఎన్ని చేసిన ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉంటారని… రేవంత్ రెడ్డి నన్ను ఒంటరి చేసారని మాట్లాడటం సరైంది కాదని విహెచ్ విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version