ఇదేనా ప్రజాపాలన అంటూ సిరిసిల్లా కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశాడు. రేషన్ షాప్‌ల సెలక్షన్‌లో అవకతవకలు జరిగాయని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజా ప్రభుత్వంలో రేషన్ షాప్‌ల ఉద్యోగం కోసం నాయకులు వసూళ్ల చేస్తున్నారా అంటూ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశాడు.
గత సర్కార్ రేషన్ డీలర్ల నియామకం తాత్కాలికంగా స్వశక్తి మహిళ సంఘాలకు నియామకం అప్పగించారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక నోటీఫీకేషన్ వేసి.. ఆర్హులైన వారికి రాత పరిక్ష, ఇంటర్య్వులతో కేటాయింపులు చేశారు. అయితే… నియామక పక్రియాలో కాంగ్రెస్ నేత జోక్యం చేసుకున్నారట.. అధికారులపై ఒత్తిడితో.. పక్రియ పక్కధారి పట్టించారట. సిరిసిల్ల కాంగ్రెస్ ముఖ్య లీడర్లకు, ఓ యువ మహిళ నేతకు కేటాయింపు..? ఇచ్చినట్లు సమాచారం. చట్టబద్దంగా నిబంధనల ప్రకారం జరగాల్సిన రేషన్ డీలర్ల నియామకం .. కాంగ్రెస్ నేత తీరుతో సర్కారు కు చెడ్డ పేరు వచ్చిందని చర్చ జరుగుతోంది.