తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ఠ్. 25 కంపార్టుమెంట్లలో తిరుమల భక్తులు వేచివున్నారు. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. ఈ తరుణంలోనే… 82, 406 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే 31,151 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు హుండి ఆదాయం 3.68 కోట్లుగా నమోదు అయింది.
ఇది ఇలా ఉండగా.. తిరుమల చుట్టు ప్రస్తుతం లడ్డూల వివాదం కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో వేరే మతస్తులతో ఉద్యోగాలు చేయించకూడదు అని శ్రీ విద్యా పీఠాధిపతులు వాసుదేవానందగిరి స్వామీజీ అన్నారు. తిరుమల లడ్డూ ఘటన తర్వాత అన్ని దేవాలయాలపై భక్తులకు విశ్వాసం తగ్గింది ఏ ప్రసాదంలో ఏం వుందో తెలియక భక్తులు అయోమయం చెందుతున్నారు. దీనికి కారణమైన వారిని న్యాయస్థానాల ముందు నిలబెట్టాలి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని దేశంలోని అన్ని ల్యాబ్ లు చెప్పాయి. ల్యాబ్ రిపోర్టులనే తప్పు అంటే ఇంతకంటే అవివేకం మరొకటి ఉండదు అని పేర్కొన్నారు.