తెలంగాణ కేబినెట్ సమావేశంలో జరిగిన పలు విషయాల గురించి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేబినెట్ సమావేశంలో ఒక మంత్రికి ముఖ్యమంత్రికి గొడవ జరిగింది. అలాగే ఒక సీనియర్ మంత్రికి ఇంకో మంత్రికి కూడా వాగ్వాదం జరిగింది. వీళ్లకి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఫండ్స్ అలొకేషన్ విషయంలో గొడవ జరిగింది. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేయాలని రూ.1000 కోట్ల అలోకేట్ చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తే.. దానికి ముఖ్యమంత్రినే వ్యతిరేకించారు.

ఎన్నో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయని.. అన్ని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు తీసుకుపోతే ఎలా అని సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ మంత్రికి వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి గత కేబినెట్ మీటింగ్ లో ఉదండపూర్ రిజర్వాయర్ ఎస్టిమేషన్ ను రూ.430 కోట్ల నుంచి రూ.1150 కోట్లకి రివైజ్డ్ ఎస్టిమేషన్ వేయించుకున్నాడు. పొంగులేటికి రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇచ్చారు.. మరి మాకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఉన్నారు కదా వాళ్లకు ఎందుకు ఇవ్వరని మంత్రుల మధ్య పంచాయితీ మొదలైందని తెలిపారు మహేశ్వర్ రెడ్డి.