ఒకటి రెండు రోజుల్లో నన్ను కూడా అరెస్ట్ చేస్తారు- చంద్రబాబు

-

రాయదుర్గం పల్లె ప్రగతి కోసం ప్రజావేదిక లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రం లో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఆరాచక పాలన కోసం ఇంటికి ఒకరు ముందుకు రావాలి అన్నారు. ఒకటి రెండు రోజుల్లో నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.. నా పైనా దాడులు చేస్తారు. నా పైనే తప్పుడు కేసులు పెడుతున్నారు.

ప్రతిపక్షాలు బయటకు రాకుండా బయటకు రాకుండా చేస్తున్నారు. ఎక్కువగా మాట్లాడితే రౌడీలతో దాడులు చేయిస్తున్నాడు. టిడిపిలో హయంలో వివేకాను హత్య చేసి.. నారాసురా రక్త చరిత్ర అని రాశారు. పింక్ డ్తెమండ్ సిబిఎన్ ఇంట్లో ఉందని ప్రచారం చేశారు. పుంగనూరు , తంబాలపల్లిలో 400 మంది పై కేసులు పెట్టారు. పుంగనూరు అలర్లలో నేను చెప్పానని చల్లాబాబు ను సంతకం పెట్టమన్నారు. కుప్పంకు వెళ్లి నా టిక్కెట్ నేనే ప్రకటించుకోవాలా.? అని ప్రశ్నించారు. మాకు అన్యాయం జరిగిందని ఏ ఉద్యోగం సంఘం అయినా బయటకు వచ్చి పోరాడుతోందా అని ప్రశ్నించారు. మన వేలితో మన కళ్లను పొడిచే పరిస్థితి వచ్చింది. యువగళంను ప్రశాంతంగా జరుగుతోంది. అయినా దాడులు చేసి కేసులు పెడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version