దమ్ముంటే అసదుద్దీన్ నాపై పోటీ చేయాలి : షకీల్ సవాల్

-

బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం అధినేత ఆసదుద్దీన్ ఓవైసీ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. దమ్ముంటే అసదుద్దీన్ తనపై పోటీ చేయాలని తూటాలు ఎదుర్కొనేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

తనను చంపడానికి ఏడాదిగా ప్లాన్ చేస్తున్నారని… హత్యాయత్నం చేసిన ఇద్దరు నిందితులకు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని షకీల్ తెలిపారు. ఇది ఇలా ఉండగా.. రెండు రోజుల కిందట.. ఎంఐఎం అధినేత ఆసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ను కచ్చితంగా ఓడిస్తామని సవాల్‌ చేశారు. తెలంగాణ లో 45 స్థానాల్లో పోటీ చేస్తామని శపథం చేశారు ఎంఐఎం అధినేత ఆసదుద్దీన్ ఓవైసీ.

Read more RELATED
Recommended to you

Latest news