బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అవమానం జరిగింది. ప్రోటోకాల్ విషయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కింద కూర్చోబెట్టి… ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చనగారి లక్ష్మా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు స్టేజ్ మీద కూర్చున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇవాళ మహేశ్వరం ఖిల్లా మైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం పంపిణీ చేసే ఖిల్లా మైసమ్మ బోనాల చెక్కుల పంపిణీకి కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం ఇంచార్జ్ కిచ్చనగారి లక్ష్మారెడ్డిని వేదిక పైకి పిలిచారు ఈఓ.
అతనికి ప్రోటోకాల్ లేదు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.
చెక్కులు తీసుకునే వారిని మాత్రమే మీటింగ్ హాల్ లోకి అనుమతి ఉంది.. ఎమ్మెల్యే వెంట వచ్చే అనుచరులకి అనుమతి లేదన్నారు పోలీసులు. ఇక ఈఓ చెప్పడంతో చెక్కుల పంపిణీకి వచ్చి స్టేజ్ వద్ద కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన వారిని కూడా వేదిక వద్దకు రానివ్వొద్దని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రెడ్డి నిరసనకు దిగారు.