దొంగ పాస్ పోర్టుల బ్రోకర్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడటం సిగ్గుచేటు : మహేష్ కుమార్ గౌడ్

-

తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం కేసీర్ కి వెన్నతో పెట్టిన విద్య అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ప్లాప్ అయిందన్నారు. తెలంగాణకు ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్ కేసీఆర్ అని విమర్శలు చేశారు. కాంగ్రెస్ బిక్షతో కేసీఆర్ సీఎం అయ్యారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి కేసీఆర్ కి గుండెల్లో గుబులు మొదలైందన్నారు. 420 హామీలంటూ విమర్శిస్తున్న కేసీఆర్ మీ పదేళ్ల బీఆర్ఎస్ పాలన 15నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పై చర్చకు సిద్దామా అని సవాల్ విసిరారు. 

టైమ్.. వేదిక మీరే డిసైడ్ చేయండి. చర్చకు ఎక్కడికీ రమ్మంటే అక్కడికీ వస్తా ఫాం హౌస్ దాటి వచ్చే దమ్ము కేసీఆర్ కి ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం రైజింగ్ అయిందని జన్వాడలో ఉన్న ఫామ్ మౌస్ లు ఎవరెవరివి అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news