భార్యా భర్తల మధ్య ఎప్పుడైతే ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయో ఎంతో ఆనందంగా జీవిస్తారు. సహజంగా భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి. అయితే వాటిని త్వరగా పరిష్కరించుకోవడం ఎంతో అవసరం. భార్య సంతోషంగా ఉంటే ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుంది. భార్యను సంతోష పెట్టడం కోసం భర్త ఎక్కువ ఖర్చు చేయాల్సిన పని లేదు. భార్యలు కేవలం చిన్న విషయాలకే ఎంతో ఆనందాన్ని పొందుతారు. కాకపోతే బంగారం, నగలు మాత్రమే భార్యకు ఆనందమని భర్తలు పొరపాటు పడుతూ ఉంటారు. కనుక, ఈ చిన్న చిన్న పనులను చేసి భార్యను ఎంతో సంతోష పెట్టవచ్చు.
సాధారణంగా, ఆడవాళ్ళకి వాళ్ళతో కాసేపు కూర్చుని మాట్లాడితే ఎంతో ఆనందంగా భావిస్తారు. కనుక ప్రతిరోజు ప్రశాంతంగా కూర్చుని కబుర్లు చెప్పడం, ఆనందంగా సమయాన్ని గడపడం వంటివి చేయాలి. ఆడవారికి చీరలు కట్టుకోవడం ఎంతో నచ్చుతుంది. అలాంటప్పుడు, వారికి సహాయం చేయడం వంటివి చేయాలి. ఇలా చేస్తే ఎంతో సంతోషిస్తారు. బయటికి వెళ్లే సమయంలో చేతిలో చేయి వేసి నడవడం, నవ్వుతూ మాట్లాడడం, ఆనందంగా సమయాన్ని గడపడం ఎంతో అవసరం. ఇటువంటి చిన్న చిన్న ఆనందాలు మహిళలు ఎంతో అవసరం అని భావిస్తారు. చాలామంది మగవారు సమయం లేకపోవడం వలన భార్యతో కూర్చుని మాట్లాడరు.
అటువంటి సమయంలో ప్రతిరోజు ఉదయాన్నే కలిసి కాఫీ తాగడం లేక సాయంత్రం పూట కలిసి వాకింగ్ చేయడం వంటివి చేయాలి. కలిసి కూర్చుని మాట్లాడుతున్నప్పుడు లేక ఆనందంగా సమయాన్ని గడిపేటప్పుడు భార్య భుజం పై తలవాల్చి పడుకోవడం వలన మహిళలు ఎంతో సంతోషిస్తారు. మహిళలకు ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తారు. కనుక వారు బాధలో ఉన్నప్పుడు మరియు ఏడుస్తున్నప్పుడు ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. మరియు నుదుటి పై ముద్దు పెట్టడం వంటివి చేయాలి. ఇటువంటి చిన్న చిన్న పనులను చేయడం వలన భార్యలు ఎంతో ఆనందిస్తారు. ఈ విధంగా ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఎటువంటి సమస్యలు లేకుండా జీవిస్తారు.