సీఎం కేసీఆర్ చాలా పేద ముఖ్యమంత్రి – వైయస్ షర్మిల

-

ధనిక తెలంగాణ రాష్ట్రానికి పేద ముఖ్యమంత్రి… అంటూ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు వైఎస్ షర్మిల. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుంది.. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్ ఉందన్నారు.సెంటు భూమి, సొంత కారు కూడా లేని ఇలాంటి ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎక్కడా లేడు కావచ్చు అటూ ఫైర్ అయ్యారు షర్మిల.

కాళేశ్వరం కమీషన్లు ఎక్కడ దాచుకున్నారో.. సర్కారు భూములు అమ్మిన సొమ్ము ఎవరి జేబులు నింపారో? అని ప్రశ్నించారు. అబద్దాలు ఆడితే అతికినట్లు ఉండాలంటారు.. పదేళ్లు గా ప్రతి పథకంలో తెలంగాణ సొమ్మును అందిన కాడికి దోచుకున్న కేసీఆర్ అండ్ కో అఫిడవిట్ లో చూపిస్తున్న ఆస్తులు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నరన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వేల అబద్దాలు ఆడే కేసీఆర్ ఈ అఫిడవిట్ లో మాత్రం నిజాలెందుకు చెప్తారని చురకలు అంటించారు షర్మిల. కేసీఆర్ హామీలు మోసం.. ఈ అఫిడవిట్ మెగా మోసం అంతో మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version