చంద్రబాబు నాయుడుకు పూర్తిస్థాయి బెయిల్ లభించడం ఖాయం – వైసిపి ఎంపీ

-

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో పూర్తిస్థాయి బెయిల్ లభిస్తుందన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణ రాజు గారు వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పిటిషన్ హైకోర్టులో నేడు విచారణకు వచ్చిందని, గతంలో వాయిదా పడిన ఈ కేసును మళ్ళీ ఈ నెల 21వ తేదీ వరకు వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ కోరగా… 21వ తేదీ వరకు వాయిదా వేయడం కుదరదన్న న్యాయమూర్తి గారు, ఈనెల 15వ తేదీ వాయిదా వేయడం జరిగిందని తెలిపారు.

ఏదో విధంగా కేసు వాయిదా వేయించడం ద్వారా ఈనెల 28వ తేదీ వరకు సమయాన్ని తీసుకుంటే, నారా చంద్రబాబునాయుడు గారిని ఏదో ఒకటి చేయవచ్చునని అనుకుంటున్నారని, కానీ ఈనెల 20, 21వ తేదీలలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ రిపోర్ట్ క్వాష్ కోసం దాఖలు చేసిన పిటిషన్ పై అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన వర్తిస్తుందని తీర్పు వెలువడే అవకాశం ఉందని అన్నారు. అలాగే హైకోర్టులో కూడా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయి బెయిల్ లభించే అవకాశం ఉందని, ఇప్పటికే ఈ కేసులో ఉన్నవారందరికీ పూర్తిస్థాయి బెయిల్ లభించడం జరిగిందని తెలిపారు. అసలు కేసే లేదని, హైకోర్టులో నారా చంద్రబాబునాయుడు గారికి పూర్తిస్థాయి బెయిల్ లభిస్తుందన్న నమ్మకం తనకు ఉన్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే నారా చంద్రబాబు నాయుడు గారు జనబాహుల్యంలోకి తిరిగి వస్తారన్నారు. రాబోయేది అంతా శుక్లపక్షమేనని, అందరూ రైజింగ్ మూన్ ను చూస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version