సీఎం రేవంత్ రెడ్డిపై షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. ఈ రోజు మహానేత వైయస్ఆర్ గారి 76వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు షర్మిల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు సీఎంగా పని చేసిన ఆయన.. రాష్ట్రంలోనే కాదు దేశంలోను కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు.

సుపరిపాలన, సంక్షేమ పథకాలతో కోట్లాదిమంది గుండెలను తాకి.. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్, జలయజ్ఞం లాంటి పథకాలుతో పాలనలో వైయస్ఆర్ మార్క్ చూపించారన్నారు. వైయస్ఆర్ అభిమానులు, ప్రజలు పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి. వైయస్ఆర్ మరణానంతరం హైదరాబాద్ లో ఒక మెమోరియల్ ఏర్పాటు కలగానే మిగిలిపోయిందని పేర్కొన్నారు.
తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వంలో వైయస్ఆర్ మెమోరియల్ ఏర్పాటుకు రేవంతన్న సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానని స్పష్టం చేశారు.. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖలు రాయడం జరిగిందన్నారు.