బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకి సీఎం కేసీఆర్ మరోసారి టికెట్ ఇవ్వడంపై బాధితురాలు శేఝల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 7 నెలలుగా దుర్గం చిన్నయ్యపై పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఓ కామ పిశాచి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆడపిల్లలను లైంగికంగా వేధించినట్టు వెల్లడించారు. దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని.. తిరగని పోలీస్ స్టేషన్ లేదని పేర్కొన్నారు. కామపిశాచి, చీటర్ అయిన వ్యక్తి టికెట్ ఎలా ఇస్తారంటూ శేజల్ ప్రశ్నించారు.
తనకు న్యాయం జరుగకుండా దుర్గం చిన్నయ్యకి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు శేజల్. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య ఎలా గెలుస్తారో చూస్తానని సవాల్ విసిరారు. బెల్లంపల్లిలో ఇంటింటికి తిరిగి దుర్గం చిన్నయ్యకి వ్యతిరేకంగా గడపగడపకు తిరిగి ప్రచారం చేస్తానని వెల్లడించారు. డెయిరీ ఏర్పాటు చేయడానికి మొదటిసారిగా దుర్గం చిన్నయ్య వద్దకు వెళ్లామని గతంలో శేజల్ చెప్పారు.