నేను చిరంజీవి గారిని పకోడీ గాడు అనలేదు – కొడాలి నాని

-

నేను చిరంజీవి గారిని పకోడీ గాడు అనలేదని క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. మెగస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని..ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నేను చిరంజీవి గారిని విమర్శించలేదని.. చిరంజీవి మాకు సలహాలు ఇచ్చారని వెల్లడించారు.

నేను కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు సలహాలు ఇచ్చానని..నేను చిరంజీవి గారిని పకోడీ గాడు అనలేదని స్పష్టం చేశారు. నాకు చిరంజీవి మధ్య టీడీపీ అగాధం సృష్టించాలని చూస్తోందన్నారు కొడాలి నాని.రాజకీయంగా చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని చాలెంజ్ విసిరారు కొడాలి. చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుణ్ణి కాదన్నారు. డాన్సులు, నటన చేతగాని ఇండస్ట్రీలోని పకోడీ గాల్లకు చిరంజీవి సలహాలు ఇవ్వాలని అన్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news