తెలంగాణ రైతులకు షాక్..ఫిబ్రవరిలోనే రైతు బంధు ?

-

తెలంగాణ రైతులకు షాక్..ఫిబ్రవరిలోనే రైతు బంధు నిధులు పడనున్నట్లు సమాచారం అందుతోంది. రైతుబంధు కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు త్వరలోనే ఊరట లభించనుందని అధికారులు కూడా చెబుతున్నారు. సంక్రాంతి పండుగ అనంతరం నిధుల కొరత సమస్య తీరనుంది.

Shock for Telangana farmers Rythu Bandhu only after February

కేంద్రం మంజూరు చేసిన రూ. 9వేల కోట్ల రుణంలో రూ. 2వేల కోట్లు ఈనెల 16న వచ్చే అవకాశం ఉంది. నిధులు రాగానే చెల్లింపులు ప్రారంభించి ఫిబ్రవరిలో పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఇప్పటివరకు కేవలం రూ.1000 కోట్ల వరకే ప్రభుత్వం చెల్లింపులు చేయగలిగింది.

అటు తెలంగాణ దళితబంధు లబ్ధిదారులకు షాక్ తగిలింది. దళితబంధు లబ్ధిదారుల అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయాయి. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం అమలు ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో అకౌంట్లలో ఉన్న రూ. 436.27 కోట్లను 33 జిల్లాల్లోని 11,108 మంది లబ్ధిదారులు విత్ డ్రా చేసుకోలేని స్థితిలో ఉన్నారు. నియోజకవర్గానికి 1100 మంది చొప్పున 1.31 లక్షల మందిని గత ప్రభుత్వం ఎంపిక చేయగా…. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అమలుపై సందిగ్ధం నెలకొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news