కాంగ్రెస్ కి షాక్.. పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్ రాజీనామా..!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. పార్టీ నిర్ణయాలతో అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా సీనియర్ నేత, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినా తనకు సరైన గుర్తింపు లభించలేదన్నారు. తాను పార్టీ కోసం పని చేసి అన్ని విధాల నష్టపోయాయని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.


ఇటీవలి కాలంలో నా విషయంలో జరిగిన పరిణామాలు నా అభిమానులు, కార్యకర్తలను తీవ్రంగా కలిచివేశాయి. పార్టీ నాతో వ్యవహరించిన తీరుతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయని చాలా మంది నా వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం చిత్తశుద్దితో పనిచేసిన వారికి పార్టీలో సరైన పాథామ్యం దక్కడం లేదు. నేను పార్టీ కోసం కష్టపడి పనిచేసి అన్ని విధాలుగా నష్టపోయాను. నా కార్యకర్తల, అభిమానుల ఒత్తిడి, వారి మనోభావాలను గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నాను’’ అని ఖర్గేకు రాసిన లేఖలో అనిల్ కుమార్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news