తెలంగాణకు షాక్… ఒక్క రోజే 2 వేలకు పైగా కేసులు…!

తెలంగాణాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొన్నా మధ్య కాస్త తగ్గింది అనుకున్నా సరే, కరోనా కేసులు మాత్రం అసలు ఆగడం లేదు. ఇదిలా ఉంటే… గత 24 గంటల్లో 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో 2083 మంది కరోనా బారిన పడినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 64,786గా ఉంది.

corona
corona

తెలంగాణాలో రికవరీ రేటు పెరుగుతూ వస్తుంది. 17754 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 46,502 గా ఉంది. 24 గంటల్లో కరోనా బారిన పడి… 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి… 530 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పరీక్షలను కూడా తెలంగాణాలో భారీగా పెంచుతున్నారు.