సంధ్యా థియేటర్ లైసెన్స్ పై షో కాజ్ నోటీస్ జారీ చేసారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన లో మహిళ మృతి చెందింది. ఒకరి మృతికి కారణమైన మీ థియేటర్ లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదు అంటూ నోటీస్ లు ఇచ్చారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వకపోతే లైసెన్స్ రద్దు చేస్తామంటూ హెచ్చరించారు పోలీసులు.
అయితే ఈ సంధ్యా థియేటర్ ఘటన పై హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటన జరిగి రెండు వారాలు అవుతుంది. ఈరోజు ప్రభుత్వం తరపు నేను, హెల్త్ సెక్రెటరీ శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాము. తొక్కిసలాటలో శ్రీ తేజ్ కుబ్రెయిన్ డమేజ్ జరిగింది. రికవరీ కావడానికి చాలా సమయం పడుతుంది. ట్రెట్ మెంట్ సుదీర్ఘంగా సాగె అవకాశం ఉంది. త్వరలో శ్రీ తేజ్ ఆరోగ్యం పై వైద్యులు బులిటెన్ విడుదల చేస్తారు అని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.