మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావుకు బిగ్ షాక్ తగిలింది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావుకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌పై చేసిన ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది AICC మహిళా కాంగ్రెస్ పార్టీ.

ఏడు రోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు AICC మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ. కాగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు హాట్ కామెంట్స్ చేసారు. మహేష్ కుమార్ గౌడ్ మరదలికి, చెల్లికి పదవులు ఇచ్చుకున్నాడని ఫైర్ అయ్యారు. పార్టీలు మారిన వారికే పదవులు వస్తున్నాయి.. మా చెల్లెళ్ళకు మాత్రం రావడం లేదని ఆరోపణలు చేశారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు. ఇక ఈ తరుణంలోనే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావుకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.