Show cause notices to Megha company on Sunkishala incident: మెఘా కంపెనీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సుంకిసాల ఘటనపై.. మెగా కంపెనీకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల నాగార్జునసాగర్ ప్రాజెక్టు దగ్గర.. సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిపోయింది. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వ అధికారుల.. నిర్లక్ష్య ధోరణి అలాగే కాంట్రాక్టర్ నిర్వహణ లోపం కారణంగా ఈ సుంకి శాల గోడ కూలడం జరిగింది.

దీనిపై గులాబీ పార్టీ తీవ్రమైన విమర్శలు చేసింది. ఈ తరుణంలో దిగివచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. సుంకిసాల ఘటనపై.. మెగా కంపెనీకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రాజెక్ట్ డైరెక్టర్‌పై బదిలీ వేటు, ఆయనతో పాటు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సర్కిల్ – 3 అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం….ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.