రేపు ‘సిద్దిపేట ఐటీ హబ్’ ప్రారంభించనున్న కేటీఆర్

-

ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని పలు నగరాల్లో ఐటీ టవర్లను నిర్మిస్తోంది. వీటి ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ఐటీ హబ్​లు నిర్మించి.. అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక తాజాగా నిజామాబాద్, నల్గొండ, సిద్దిపేటలో ఐటీ హబ్​ల నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈనెల 15వ తేదీన సిద్దిపేట ఐటీ హబ్​ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్‌ రహదారిని ఆనుకొని నిర్మించిన ఐటీ టవర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ టవర్‌ను పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావుతో కలిసి గురువారం ప్రారంభించనున్నారు. 3 ఎకరాల సువిశాల స్థలంలో రూ.63 కోట్లతో జీప్లస్‌ 4 అంతస్తుల్లో ఐటీ టవర్‌ను నిర్మించారు. ఈ టవర్‌ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్‌ 2020 డిసెంబర్‌ 10న శంకుస్థాపన చేశారు. గత ఏడాది నిర్మాణ పనులు ప్రారంభం కాగా, త్వరితగతిన పూర్తయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version