BREKAING : సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ నెలకొంది. తెలంగాన మంత్రి పొన్నం ప్రభాకర్, సిద్దిపేట జిల్లా DCC అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి తీరుపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గ నేతలకు సమాచారం ఇవ్వకుండా చక్రధర్ గౌడ్ ని పార్టీలో చేర్చుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
చక్రధర్ గౌడ్ పై చీటింగ్, అత్యాచారం కేసులు ఉండటంతో చేరికకు అభ్యంతరం తెలుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే చెడ్డపేరు వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్, సిద్దిపేట జిల్లా DCC అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొన్నం, DCC అధ్యక్షుడు నర్సారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నేతలు. కాగా… తాజాగా చక్రధర్ గౌడ్… మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.