ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిక్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి తన దుర్బుద్ధి చూపించాడు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ను చంపేస్తానని బెదిరించాడు. ఆ రాష్ట్ర డీజీపీ గౌరవ్ యాదవ్ను కూడా హత్య చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. గణతంత్ర దినోత్సవం) రోజున సీఎంపై దాడి చేసేందుకు గ్యాంగ్‌స్టర్లు అందరూ కలిసి రావాలని పన్నూ పిలిపునిచ్చాడు.
గ్యాంగ్‌స్టర్లకు వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో సీఎం భగవంత్ మాన్కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇప్పటికే పలుమార్లు భారత్‌లోని ప్రఖ్యాత ప్రాంతాలపై దాడులు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూ వస్తున్నాడు. వీటని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తూ అప్రమత్తం అవుతూ వస్తోంది. దాడులు జరగకుండా ఎప్పటికప్పుడు భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. కాగా, సిక్స్ ఫర్ జస్టిస్ వేర్పాటువాద సంస్థను భారత్ 2019లోనే నిషేధించింది. 2007లో ఈ సంస్థను స్థాపించగా దాని వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా ఒకడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే.