తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తెలంగాణలో రానున్న మరో రెండు రోజులపాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలపై స్పందిస్తూ సూచనలు చేశారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి.
ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ” ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నేలలు భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్నయి . బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాలతో పాటు మన వంతుగా అప్రమత్తతతో ఉండాలి. మనము, మన కుటుంబాలు, మన ఇరుగుపొరుగువారు ప్రమాదాల బారిన పడకుండా ఈ కింద తెలిపిన సూచనలు పాటిద్దాం… అందరం భద్రంగా ఉండేలా చూసుకుందాం.
1) కరెంటు స్తంభాలను,విద్యుత్ వైర్లను,ట్రాన్స్ ఫార్మన్లను తాకకండి. 2) మ్యాన్ హోల్స్, డ్రైనేజీలను చూసుకుని నడవండి. 3) ఉధృతంగా ప్రవహించే చెరువులు, వాగుల వద్దకు వెళ్లకండి. 4) వ్యవసాయ క్షేత్రాలు, ఆ పరిసర ప్రాంతాల్లో విష సర్పాలతో జాగ్రత్త. 5) పాత గోడలు, పాత ఇండ్లు కూలిపోయే స్థితిలో ఉంటే ముందస్తు జాగ్రత్త తీసుకోండి. 6) అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్ళకండి” అని సూచించారు రాములమ్మ.
https://x.com/vijayashanthi_m/status/1830888163293687958