రంగులు మార్చే ఊసరవెళ్లి చీర.. సిరిసిల్ల నేతన్న అద్భుత ఆవిష్కరణ

-

రాజన్న సిరిసిల్ల జిల్లా నేత కళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతమైన చీరను రూపొందించారు. ఇంతకు ముందే ఆయన అగ్గిపెట్టలో ఇమిడే చీరను రూపొందించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అగ్గిపెట్టలో ఇమిడే చీరను రూపొందించారు. దాంతో పాటు ఈసారి రంగులు మార్చే చీరను కూడా తయారు చేశారు విజయ్.

ఈ రెండు చీరలను హైదరాబాద్​కు తీసుకువచ్చారు. అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. దివంగత నల్ల పరంధాములు వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమారుడు నల్ల విజయ్‌ ఈ చీరలను తయారు చేశారు. 30 గ్రాముల బంగారం, 500గ్రాముల వెండి, పట్టు పోగులతో నెల రోజుల పాటు శ్రమించి రంగులు మారే చీరను రూపొందించినట్లు విజయ్ తెలిపారు. విజయ్‌ గతంలో సుగంధాలు వెదజల్లే చీరను సైతం తయారు చేయగా త్వరలోనే మరో 25 లక్షల రూపాయల విలువైన చీరను సిరిసిల్ల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించినున్నట్లు వెల్లడించారు. అద్భుతమైన చీరలు రూపొందించిన చేనేత కళాకారుడ్ని మంత్రి అభినందించి సత్కరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version