హైదరాబాద్ లో మోగిన సైరన్లు

-

కేంద్రం ఆదేశాల మేరకు ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నామని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. తాజాగా  సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్ DRDO మౌలాలిలోని NFC లో సైరన్లు మ్రోగాయి. రెండు నిమిషాల పాటు సైరన్లు మోగిన తరువాత  మాక్ డ్రిల్ లో  అవగాహన కల్పించారు.  15 నిమిషాల పాటు మాక్ డ్రిల్ కొనసాగుతుందని తెలిపారు. NCC, NSS క్యాడెట్స్, NDRF, SDRF రెస్క్యూ రిహార్సల్ చేపట్టబోతున్నట్టు తెలిపారు సీవీ ఆనంద్.

సైరన్ మోగిన తరువాత ప్రజలు స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. సైరన్ మోగిన తరువాత ప్రజలు ఇళ్లలోనే ఉండాలని.. బయటికి రావద్దని సూచించారు. ఒకవేళ బయట ఉన్నవాళ్లు సురక్షిత నిర్మాణాల్లోకి వెళ్లాలని కోరారు. ప్రమాదాలు జరిగితే ఎలా అరికట్టాలని.. అక్కడ వైద్య సిబ్బందిని అంబులెన్స్ లను ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలని సూచించారు మాక్ డ్రిల్ లో.భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా వ్యవహరించాలని అవగాహన కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news