ఆపరేషన్ సింధూర్ పై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదిక గా ఓ వీడియో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ గీత దాటింది. అమాయకులను చంపింది. చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు.. వంద పాకిస్తాన్ లు వచ్చినా భారత దేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. వంద పాకిస్తాన్ లకు సమాధానం చెప్పే మిస్సైల్ నరేంద్ర మోడీ అని కొనియాడారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా లోకేశ్ చేసిన ప్రసంగంలోని కొన్ని పాయింట్లు.. ఉగ్రవాదులపై సైన్యం చేసిన దాడి దృశ్యాలు, మోడీ ప్రసంగం కలిపి ఉన్న వీడియో ను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిస్పందనగా భారత సాయుధ బలగాలు పాకిస్తాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల్లో ఆ 9 ప్రాంతాలనే టార్గెట్ చేశారు. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం.
మన నేల పై మొలిచిన మొక్క కూడా పీకలేరు! వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే మిస్సైల్ పేరు మోదీ. #OperationSindoor #PahalgamTerrorAttack pic.twitter.com/dHVA5menie
— Lokesh Nara (@naralokesh) May 7, 2025