నిన్న ప్రపంచ ఆదివాసీల సెలబ్రేషన్స్ అంటూ ప్రభుత్వం ఊరూర జరుపుకుంది, కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి అని సిర్పూర్ బీజేపీ శాసన సభ్యులు పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఆదివాసీల గ్రామాలకు నేటికీ రహదారులు లేవు. రాష్ట్రంలో గిరిజన బ్రతుకులు దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. గిరిజన గ్రామాలకు రహాదురులు లేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి.
ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పత్రికి వెళ్ళడానికి కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొనున్నాయి. గిరిజన బ్రతుకులు అట్లా ఉంటే మంత్రి సీతక్క మాత్రం గిరిజన గ్రామాలకు నాలుగేళ్లలో తారు రోడ్లు వేస్తామని చెబుతున్నారు. పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది. పంచాయితీల్లో సర్పంచులు లేరు, పంచాయితీలన్ని గ్రామ కార్యదర్శులకు అప్పజెప్పారు తొమ్మిది నెలల్లో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క గ్రామాలకు ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదు సీతక్క మీద చాలా నమ్మకం ఉండేది, కానీ గ్రామాల్లో పరిస్థితులు చూస్తుంటే సీతక్కపై ఆ నమ్మకం కోల్పోయేలా ఉంది అని హరీష్ బాబు పేర్కొన్నారు.