తెలంగాణలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు..!

-

తెలంగాణలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు అందనున్నాయి. కొత్త రేషన్ కార్డుల మంజూరీ పై సచివాలయంలో సమావేశం మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయ్యింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదరరాజనరసింహా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు.. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షల వరకు ఉన్న వారికి రేషన్ కార్డులు రానున్నాయి.

అయితే పట్టణ ప్రాంతాల్లో భూములను కాకుండా వార్షిక ఆదాయాన్ని ఆధారంగా కార్డులు మంజూరు చేయనున్నారు. విధి, విధినాల రూపకల్పనలో రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కావాలని.. లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి అని ఉత్తమ్ తెలిపారు. కాబట్టి వారందరికీ సమాచారం చేరేలా లేఖలు రాయండి. సక్సేనా కమిటీ సిఫారసులను అలాగే దేశంలోని మిగిలిన రాష్ట్రాలలో తెల్లరేషన్ కార్డుల అర్హత ప్రమాణాలు పరిశీలన చేయాలనీ పేర్కొన్నారు. అలాగే వేరే రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డు ఉండి ఇక్కడా ఉంటే వాటిని తొలిగించనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news