తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ములుగు ఎమ్మెల్యే సీతక్క బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అమెరికాలో జరుగుతున్న తానా సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. పార్టీలో ఎవరికి ఏ పదవి అనేది ఎప్పుడు ముందుగానే ప్రకటన చేయరని అన్నారు.
కాంగ్రెస్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అనుకూల పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ కి నలుగురు ముఖ్యమంత్రులు ఉంటే అందులో ముగ్గురు బీసీ లేనని అన్నారు. దీంతో తెలంగాణలో సీతక్కకి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారా..? అని ప్రశ్నించారు ఎన్. ఆర్.ఐ లు. దీంతో స్పందించిన రేవంత్ రెడ్డి.. ఈ విషయాన్ని పార్టీలో చర్చిస్తామని అన్నారు. అవసరమైతే, ఆ సందర్భం వస్తే ఉపముఖ్యమంత్రి ఎందుకు.. సీతక్క ముఖ్యమంత్రి అవుతారని కీలక వ్యాఖ్యలు చేశారు.