Yechuri Sitaram: విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యంగా ఉంది. సీతారాం ఏచూరి ఆరోగ్యంపై సిపిఐ నారాయణ మాట్లాడుతూ… సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉందన్నారు. వామపక్ష ఉద్యమాలకు ఏచూరి ఒక ఐకాన్ అన్నారు. ఏచూరి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.
ఎన్నో సమస్యలపై పోరాడిన ఏచూరి.. ఇప్పుడు తన శరీరంతోనే పోరాడుతున్నాడని తెలిపారు సిపిఐ నారాయణ. అలాగే..సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవం అధికారికంగా జరపాలని పేర్కొన్నారు నారాయణ. మజ్లిస్ పార్టీకి భయపడి గత ప్రభుత్వం విలీన దినోత్సవం జరపలేదని… ఈ పరంపరను బ్రేక్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి యంగ్, విలీన దినోత్సవం అధికారికంగా జరపాలని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదల వల్ల ఆస్తి నష్టం జరిగిందని… ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు ఎలాగో ఉంది వారికి కేంద్రం జాతీయ విపత్తుగా పేర్కొని నిధులు విడుదల చేయాలన్నారు.